హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు, గోదావరి (Godavari) నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వానికి నోటీసులు, ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరిన తెలంగాణ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలున్నాయని ధర్మాసనం తెలిపింది.
ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులపై పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేఖ్ సింఘ్వీ. 15 మందిలో ఏపీకి మాత్రమే ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరిన తెలంగాణ తరఫు న్యాయవాది. లోపాలు సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామన్న న్యాయస్థానం. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.