Tirumala | శ్రీవారి ఆలయంలో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల17న ఆణివారా ఆస్థానం సందర్భంగా 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల17న ఆణివారా ఆస్థానం సందర్భంగా 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగాప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను( VIP Break Darshan) రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసామని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు.ఆదివారం స్వామివారిని 90,130 మంది భక్తులు దర్శించుకోగా 38,075 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

