హనుమకొండ చౌరస్తా, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులకు ఎరువులు దొరకపోవడం రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎరువుల విషయం లో చేతులు ఎత్తేయడం ఇందుకు నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కొరతలు లేకుండా రైతులకు సరిపడా ఎరువులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రభుత్వం విఫలమైందని విమ్శించారు. రైతుకు రుణ మాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన పేరుతో ప్రభుత్వం పాలన సాగించడం మంచిది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుకు ఒక సీజన్‌కి మూడు యూరియా బస్తాలు ఇస్తామని, డీఏపీ కొంటేనే యూరియా ఇస్తామని, లేదా పురుగు మందులు కొంటేనే అని లింక్ పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎరువులు ఇవ్వాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.