Venky 77 | వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఆల్‌టైమ్ ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సినిమాల జాబితాలో ఉంటాయి. ఇక ఈ ఇద్దరూ కలిసి కొత్త సినిమాకు ఫుల్ టైం పనిచేయబోతున్నారని తెలిసిందే. వెంకీ 77 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ అయింది.
కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం అదిరిపోయే న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. తాజా కథనాల ప్రకారం వెంకీ 77 అక్టోబర్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ కొనసాగనుందట. అంతేకాదు కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టిని హీరోయిన్గా ఫైనల్ చేయనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తుండగా.. ఈ వార్తలపై త్రివిక్రమ్ టీం నుంచి అఫీషియన్ అనౌన్స్మెంట్ వస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.
ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత ఎస్ రాధాకృష్ణ తెరకెక్కించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడని తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు వెంకీ. మరి త్రివిక్రమ్-వెంకీ కాంబో ఎలాంటి వినోదాన్ని అందించబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్