They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ఓజీ. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
ఓజీ నుంచి పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌తో సాగే వాషి యో వాషి ట్రాక్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవన్ కల్యాణ్ మళ్లీ రెండు దశాబ్ధాల తర్వాత ఓజీ కోసం రూల్ బ్రేక్ చేశాడు. ఎస్ థమన్ ఇండియన్ ఐడల్ సీజన్ 4లో ఈ విషయం గురించి షేర్ చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ ఫస్ట్ హాఫ్ చూశాడన్నాడు థమన్.
ఖుషి తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి రికార్డింగ్ థియేటర్‌కు వచ్చాడు.. ఓజీ మూవీని చూశారని అన్నాడు థమన్. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ముఖ్యమైన సీక్వెన్స్‌ను పవన్ కల్యాణ్ చూశాడు. ఫస్ట్ హాఫ్‌ను చాలా బాగా లైక్ చేశాడు. సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉండటమే కాదు.. .. మాపై ఉన్న ప్రేమను కూడా చూపించాడు. వాషి యో వాషి రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీరు ఓజీ హుడీ వేసుకుంటారా..? అని అడిగితే పవన్ కల్యాణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హుడీని వెంటనే వేసుకున్నాడు. స్టూడియోలో జరిగిన క్యూట్ విషయం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ ఎపిసోడ్లో ప్రియాంక అరుళ్ మోహన్ సందడి చేసింది. ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఇటీవలే ఓజీ నుంచి అర్జున్ దాస్ క్యారెక్టర్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ ప్రిపరేషన్లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Itlu Me Yedhava | ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సానా