Snakebte : పాములంటే ఎవరికైనా భయమే. చాలామంది పాము కనిపిస్తే భయంతో వణికిపోతారు. కొందరైతే ఆ పరిసరాల్లో కూడా ఉండకుండా పారిపోతారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఓ యువకుడు మాత్రం పక్కింట్లో దూరిన పామును పట్టేశాడు. అంతటితో ఆగకుండా దాన్ని మెడలో వేసుకుని వీడియో తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని కాటువేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్ జిల్లాలోని భోపా పోలీస్స్టేషన్ పరిధిలోని మోర్నా గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు మోహిత్.. పక్కింట్లో పాము దూరిందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ పామును మెడలో వేసుకుని వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని మెడలో నుంచి తీసి సంచిలో వేయబోతుండగా చేతిపై కాటువేసింది.
దాంతో అతడు అందరూ చూస్తుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
कहते हैं “जिसका काम उसी को साजे और करे तो डंके बाजे”
सांप को खिलौना समझकर खेल रहे इस युवक की लापरवाही इसी की जान पर भारी पड़ गई सांप ने डस लिया जिससे युवक की जान चली गई, घटना पीड़ादायक है मगर ऐसी लापरवाही ही क्यों करनी थी।
स्थान-मुजफ्फरनगर pic.twitter.com/YJpryDTqNg— Neeraj Raathi (@neeraj_raathi) September 22, 2025
जहरीले सांप से खिलवाड़ पड़ा भारी.. युवक की सांसे टूटी… वीडियो कैमरे मे हुई कैद!
UP क़े ज़िला मुज़फ्फरनगर क़े मोरना मे जहरीले नाग क़े साथ खेलना युवक मोहित (24) को भारी पड़ा। मोहित को नाग डसता रहा.. मगर उसने कोई परवाह नही की। लोग वीडियो बनाते रहे। थोड़ी देर मे उसकी मौत हो गई।… pic.twitter.com/Zc1sBXywJQ
— TRUE STORY (@TrueStoryUP) September 21, 2025