నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో సోమవారం రైతులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై కలెక్టర్కు, మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. దొడ్డు రకం ధాన్యానికి గ్రేడ్ వన్ ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరన్న తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.