ధర్మశాల: భారత క్రికెటర్ హర్షదీప్ సింగ్(Arshdeep Singh).. తన గర్ల్‌ఫ్రెండ్ సమ్రీన్ కౌర్‌తో చక్కర్లు కొడుతున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడుతున్న అతను.. ధర్మశాల వీధుల్లో సమ్రీన్‌తో తిరుగుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ సిటీలోని ఓ వీధిలో.. ఎటువంటి సెక్యూర్టీ లేకుండానే ఇద్దరూ తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. లోకల్ మార్కెట్లో ఇద్దరూ మచ్చట్లు పెడుతూ వాకింగ్ చేస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్లో తీశాడు. యే దేకో కోహీ సెక్యూర్టీ నహీ అని అంటూ ఆ వీడియోలో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. చాలా సాదాసీదాగా హర్షదీప్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగడం అందర్నీ స్టన్ చేస్తోంది.
భారత క్రికెట్ జట్టులో అతనికి మంచి గుర్తింపు ఉన్నా.. అతను మాత్రం చాలా సింపుల్‌గా సెక్యూర్టీ లేకుండా తిరుగుతున్నట్లు కొందరు కామెంట్ చేశారు. గతంలో కూడా ఈ ఇద్దరూ వీడియోలకు చిక్కారు. ఎయిర్‌పోర్టులో సమ్రీన్ కౌర్ బ్యాగ్‌ను హర్షదీప్ పట్టుకున్నాడు. ఈ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఆ రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేయలేదు.
Arshdeep Singh with Samreen Kaur on the streets of Dharamshala . Only in Himachal you’ll see cricketers walking around so freely without much security or chaos! Still feels a bit risky though. Wonder what the usual protocol is for players in such situations? pic.twitter.com/pjsirG1ypw
— Nikhil saini (@iNikhilsaini) May 11, 2026