KP Vivekananda | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం బాధిత కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనర్ బాలికకు న్యాయం చేయకుండా, బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని కేపీ వివేకానంద ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని నిలదీశారు. మైనర్ బాలికకు న్యాయం చేయని వాళ్లు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తన కొడుకు అకృత్యానికి బాధ్యత వహించి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్‌గా తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.
బండి సంజయ్ కుమారుడు భగీరత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే @kp_vivekanand ప్రశ్నించారు.
జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…👇🏻
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోమ్… pic.twitter.com/AZqDqHjlLy
— BRS Party (@BRSparty) May 11, 2026