నిజాంపేట్, మార్చి 5 : నూతన వాహనాల ఎల్ఈడీ లైట్లే 161 జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహన చోదకులు అంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడీ లైట్స్ వల్ల కళ్లు కనిపించడంలేదని.. దీనికంతటికీ ఆర్టీఏ శాఖ పనితీరులో లోపమే కారణమని పలువురు మండిపడుతున్నారు. ఎల్ఈడీ లైట్లతో ప్రమదాలు జరుగుతన్నందున రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అసలు ఆర్టీవో శాఖ అనేది ఉందా అసలు అది పని చేస్తుందా? ఈ లైట్లు ఎంటీ? ఈ వాహనాలు ఎంటీ? రోడ్డు మీద రాత్రి వేళ వాహనాలు నడపాలంటేనే భయమేస్తోందనీ పలువురు వాపోతున్నారు.
గతంలో వాహనాల హెడ్ లైట్ సగం వరకు బ్లాక్ పెయింట్గానీ, నలుపు స్టిక్కర్గానీ ఉండేది. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉంటేగానీ కానీ వాహనాలకు అనుమతి నిచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు ఆ నియమాన్ని పాటించడం లేదు. కొత్త వాహనాలకు ఎల్ఈడీ లైట్లను అనుమతిస్తున్నారు. ఫలితంగా రాత్రివేళ.. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతి వల్ల కళ్లకు ఏమీ కనిపించక.. అనేక ప్రమాదాలు జరుగుతు ఉన్నాయి.
కాబట్టి సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్లకు వస్తున్న ఎల్ఈడీ లైట్ల సమస్యను తీవ్రంగా పరిగణించాలి. ఇకపై కొత్త వాహనాలకు హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ ఉండాలనే నియమాన్ని పునరుద్దరించాలనీ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.