KKR vs DC : టాపార్డర్ వైఫల్యంతో మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాలు మరింత పెరిగాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచుల్లో అర్ధ శతకంతో చెలరేగిన ట్రిస్టన్ స్టబ్స్(4), కెప్టెన్ రిషభ్ పంత్(27), యువకెరటం అభిషేక్ పొరెల్(18)లు సైతం స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు.
వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లలో పంత్, స్టబ్స్‌ను ఔట్ చేసి ఢిల్లీని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు., సునీల్ నరైన్ సైతం స్పిన్ ఉచ్చు బిగించడంతో బౌండరీలు రావడం గగమనమై పోయింది. ప్రస్తుతం అక్షర్ పటేల్(15), ఇంప్యాక్ట్ ప్లేయర్ కుమార్ కుశగ్ర(1) ఢిల్లీకి పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత భుజాన వేసుకున్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 101/6.