Esha Singh | భోపాల్: హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకుంది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ టీ4లో భారత స్టార్ షూటర్ మనూ భాకర్ 586 స్కోరు చేయగా ఇషా సైతం 586 పాయింట్లతో టాప్-2లో నిలిచి పారిస్ కోటాను ఖాయం చేసుకున్నారు. ఇదే కేటగిరీలోని పురుషుల విభాగంలో అనిష్ భన్వాలా, విజయ్‌వీర్ సింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.