Karnataka | మా కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెను.. తల్లిదండ్రుల పత్రికా ప్రకటన
కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన ఆసక్తికరంగా ఉంది. 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో కోరారు. “కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను.
Karnataka | బెంగళూరు: కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన ఆసక్తికరంగా ఉంది. 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఈ ప్రకటనలో కోరారు. “కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 ఏండ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన, 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్లయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి” అని ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబరును కూడా ఇచ్చారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబ పెద్ద ఒకరు చెప్పారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెండ్లి చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

