Nikhat Zareen | అస్తానా: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు అస్తానా (కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డ కప్‌లో వరల్డ్ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిరౌండ్లో అదరగొట్టింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్లో నిఖత్ (52 కిలోల విభాగంలో).. 5-0 తేడాతో రఖైంబెర్డి జన్సాయాను ఓడించింది.
బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లతో విరుచుకుపడ్డ నిఖత్.. అలవోక విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. నిఖత్‌తో పాటు మీనాక్షి (48కి.), అనామిక (50కి.) సైతం తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఇష్మీత్ సింగ్ (75కి.), సోనియా (54కి.) ఆరంభ బౌట్‌లోనే ఓటమిపాలయ్యారు.