Prajwal Revanna | బెంగళూరు, మే 13: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో బాధిత మహిళలు మరిన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా మరో మహిళ ప్రజ్వల్ వేధింపులపై సిట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. ‘నాకు అతడు తరచూ వీడియో కాల్ చేసి నా దుస్తులు తొలగించమనేవాడు. లేకపోతే మా నాన్నను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించేవాడు. మా అమ్మకు హాని చేస్తానని బెదిరించేవాడు. మా అమ్మ వాళ్లింట్లో పని చేసేది. మా అమ్మను అతడు రేప్ చేశాడు. వాళ్లు పనివాళ్లను బానిసలుగా చూస్తారు. నేను ప్రజ్వల్‌పై ఫిర్యాదు చేశాక మా నాన్నను ఉద్యోగం నుంచి తీసేశారు’ అని ఆ మహిళ వాపోయింది.
తన తల్లిని ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ కూడా లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. తన తల్లి నాలుగైదు నెలలకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేదని.. ఎప్పుడైనా అర్ధరాత్రి తర్వాతే ఫోన్ చేసి మాట్లాడేదని చెప్పింది. పండ్లు ఇచ్చే నెపంతో ప్రజ్వల్ ఇంట్లోని ఆడ పనివారిని లైంగికంగా వేధించేవాడని వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆమె వెల్లడించింది. మరోవైపు మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణకు బెంగళూరు కోర్టు రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కిడ్నాపైన మహిళ రేవణ్ణ ఇంట్లో పనిచేసే మనిషేనని.. కిడ్నాప్‌పై ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.