హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో సోమవారం సామూహిక వందేమాతరాన్ని గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పూర్తి వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని ఆదేశించింది.
అంతేకాకుండా వందేమాతరంపై వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించాలన్నదినిర్వహించాలన్నది. వీటిని కఠినంగా అమలుచేయాలని ఆదేశించింది.