హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీ -26ను వేయాలని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య డిమాండ్ చేశారు. విద్యుత్తు ఉద్యోగుల బదిలీల్లో కనీస సర్వీసును రెండేండ్లు కాకుండా మూడేండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
సంఘం నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభను ఆదివారం నిర్వహించగా, అంజయ్య మాట్లాడుతూ 1999 నుంచి 2004 వరకు నియమితులైన వారికి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు సంస్థల డైరెక్టర్లు వీర మహేందర్, తిరుపతిరెడ్డి, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్‌దాస్, కిషన్, దేవేందర్, రాష్ట్ర అధ్యక్షుడు నాజర్ షరీఫ్, ఎన్ అశోక్, వేణుబాబు, అనిల్, అనురాధ, ఉపేందర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.