KKR vs DC : ఈడెన్ గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాల్లో పడింది. కోల్‌కతా పేసర్ల ధాటికి వరుస ఓవర్లలో మూడు వికెట్లు కొల్పోయింది. స్టార్క్ తన రెండో ఓవర్లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (12)ను ఔట్ చేసి కోల్‌కతాను పోటీలోకి తెచ్చాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదిన ఫ్రేజర్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద వెంకటేశ్ అయ్యర్‌కు చిక్కాడు.
Venkatesh Iyer plucks a fine low catch & @KKRiders get the dangerous Jake Fraser-McGurk early 😲#DC three down now inside the powerplay!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvDC pic.twitter.com/84HRetp0ZM
— IndianPremierLeague (@IPL) April 29, 2024
ఇక తన మొదటి ఓవర్లోనే పృథ్వీ షా(13)ను వెనక్కి పంపిన అరోరా.. తర్వాతి ఓవర్లో షాయ్ హోప్(7)హాఫ్ స్టంప్‌ను ఎగరగొట్టాడు. దాంతో, ఢీల్లీ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం కెప్టెన్ రిషభ్ పంత్(), అభిషేక్ పొరెల్()లు ఢిల్లీని గట్టెక్కించే పనిలో ఉన్నారు. 5 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..