దామరచర్ల, మార్చి 16 : కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కె. వీరకోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో 12-14 సంవత్సరాల లోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎమ్లను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బంటు కిరణ్, నాయకులు ఆంగోతు హతీరాం, బాల సత్యనారాయణ, కందుల నర్సింహారెడ్డి, రఫీ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందించిన సేవలు మరువలేనివని మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అన్నారు. బుధవారం నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ప్రకాశ్‌నగర్ హెల్త్ సెంటర్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలను సన్మానించారు. అనంతరం 12 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, పద్మాబాయి, నాగమణి, మంజులత, రజిత, కళ, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
తిప్పర్తి : 12-14 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ టీకా వేయించాలని ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు సూచించారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అనూష ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలకేంద్రంలోని పీహెచ్సీలో టీకా కార్యక్రమాన్ని కట్టంగూర్ సర్పంచ్ చెనగోని సతీశ్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం కరోనా సమయంలో గ్రామాల్లో ఉత్తమ వైద్య సేవందించిన ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గౌతమ్‌కుమార్, వినయ్‌కుమార్, స్టాప్ నర్సు జోస్పిన్, సూపర్వైజర్ మేరీ, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశ కార్యకర్తలు ధనలక్ష్మి, అంతటి పద్మావతి, తవిటి వెంకటమ్మ పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 నుంచి 14ఏండ్ల లోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వైద్యాధికారి నితిన్ గౌతమ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల వెంకన్న, పీహెచ్ఎన్ మంగీబాయి, చెరుకు శంకర్, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్న్ను మండల వైద్యాధికారి వెంకన్న ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో గంట శంకర్, అమర్, ఏఎన్ఎం, సిబ్బంది ఉన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని ఆలగడప పీహెచ్సీలో ఆరోగ్య, ఆశ కార్యకర్తలను జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి సన్మానించారు. అనంతరం 12 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మండల వైద్యాధికారి చింతల వినీత, పీహెచ్ఎస్ ఓంకారమ్మ, ప్రభాకర్, మాజీ సర్పంచ్ ముత్తయ్య, చదుర్ల శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ మస్రత్ సయ్యద్‌మియా, వైద్యులు నవనీత, భవానీచక్రవర్తి సిబ్బంది పాల్గొన్నారు.