హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని కోరారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యరంగంపై కేంద్రం మరింత దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీహెచ్సీల్లో ఖాళీలు భర్తీచేస్తే పేదలకు వైద్యం అందుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సాంకేతిక, ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.