లక్నో, నవంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ స్థిర, చరాస్తులను వెల్లడించని ఉద్యోగుల వేతనాలను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ్ సంపద అనే పోర్టల్లో పొందుపర్చాలని యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ఇంకా 34,459 మంది ఉద్యోగులు ఆస్తులను వెల్లడించలేదు. ఉద్యోగులందరికీ దీపావళి పండుగకు ముందే యూపీ ప్రభుత్వం వేతనాలు జమ చేసినప్పటికీ వీరికి మాత్రం నిలిపివేసింది.