హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ) : నీటి వినియోగాలపై అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ అబద్ధాలు వల్లెవేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ కంటే ఎక్కువ జలాలను వాడామంటూ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. ఎల్ నినో ప్రభావం అన్న అంశంపై చర్చ ను ప్రారంభిస్తూ మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ప్రస్తుత నీటి సంక్షోభానికి ఎల్ నినో, బీఆర్ఎస్ కారణమంటూ నెపం మోపేందుకు యత్నించారు. శ్రీశైలం నుంచి ఏపీ కంటే ఎక్కువ మొత్తంలో జలాలను వాడామంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. శ్రీశైలం నుంచి ఏపీ 53 టీఎంసీలను మళ్లించుకుంటే, తెలంగాణ 83 టీఎంసీలను వాడిందని బుకాయించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి 34 టీఎంసీలకే అనుమతి ఉన్నది. అయినా అంతకు మించి, అదీ ఎల్ నినో నేపథ్యంలో బేసిన్ అవతలికి జలాలను తరలించుకుపోయింది. ఇప్పటికీ మళ్లిస్తున్నది. కానీ, ఏపీ తక్కువగానే 53 టీఎంసీలనే వాడిందని మంత్రి ఉత్తమ్ వెనుకేసుకురావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ 83 టీఎంసీలను వాడిందంటూ తప్పుదోవ పట్టించేందుకు తెరతీశారు. శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణలో ఉన్న ఒకేఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎత్తిపోసింది కేవలం 8.9 టీఎంసీలే. కానీ, 83టీఎంసీలను మళ్లించామంటూ చెప్పొకొచ్చారు. విద్యుదుత్పత్తికి వినియోగించిన జలాలను లెక్కగట్టి సభను తప్పుదోవ పట్టించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ. లక్షల కోట్ల భూమార్పిడి, కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్ సర్కార్, ఆ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అధికారంలో ఉండి కూడా ఈ మార్పిడిపై చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. సుమారు 23 లక్షల ఎకరాల మేర అవకతవకలు జరిగినట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించినప్పుడు, ఆ రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని, ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, తాము కూడా విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇక పార్ట్-1బీ కింద 5 లక్షల ఎకరాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన క్లియర్ చేసిందో చెప్పాలని, మిగిలిన 25 లక్షల ఎకరాల సమస్య కూడా పరిషారమవుతుందని తెలిపారు. బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టం 22ఏ కింద లక్షలాది మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.