అనుకున్న సమయానికి కష్టమేనా?
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలను గమనిస్తే ఈ ఏడాది ‘ఫౌజీ’ విడుదల అసాధ్యమనే టాక్ వినిపిస్తున్నది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలను గమనిస్తే ఈ ఏడాది ‘ఫౌజీ’ విడుదల అసాధ్యమనే టాక్ వినిపిస్తున్నది. బ్యాలెన్స్‌గా ఉన్న వర్క్ కారణంగా ఈ సినిమా డిసెంబర్ బరి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించాల్సి ఉంది. వీటికి 40రోజుల కాల్షీట్లు అవసరమని చెబుతున్నారు. దీనితో పాటు కొంత ప్యాచ్ వర్క్ కూడా మిగిలి ఉండటంతో మొత్తంగా 50రోజులకుపైగా షూటింగ్ అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న ‘ఫౌజీ’ రిలీజ్ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని, ముందస్తు ప్రకటించిన తేదీనే సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
ఇమాన్వి, మిథున్చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

