వాషింగ్టన్ : ఇంగ్లిష్ ప్రావీణ్య పరీక్షల్లో విఫలమైన 7,200 మంది వాణిజ్య ట్రక్కు డ్రైవర్లను (Truck Drivers) అమెరికా (America) ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. వీరిలో భారతీయులు అధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల రహదారులపై వరుసగా దారుణ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ఆ మేరకు ట్రక్ డ్రైవర్లకు పరీక్షను నిర్వహించింది.
అమెరికాలో 1,30,000 నుంచి 1,50,000 మంది ట్రక్ డ్రైవర్లు ఉండగా, పంజాబ్, హర్యానాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారు వీరిలో అధికంగానే ఉన్నారని ఉత్తర అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ వెల్లడించింది. తాజా తొలగింపు ప్రభావం వీరిపై అధికంగా పడిందని తెలిపింది.