వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఏఐ) రిక్రూట్మెంట్ స్టార్టప్ మెర్కర్ వ్యవస్థాపకులు అత్యంత పిన్న వయసులోనే స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగిన ఘనతను సాధించారు. 2008లో మార్క్ జుకర్‌బర్గ్ 23 ఏళ్ల వయసులో సాధించిన రికార్డును చెరిపేశారు. ఈ రికార్డును 22 ఏళ్ల వయసులో బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమఠ్, సూర్య మిధా సొంతం చేసుకున్నారు.
వీరు ముగ్గురూ హైస్కూల్ ఫ్రెండ్స్. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, మెర్కర్ ఇటీవలి 350 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో ఈ కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈ కంపెనీ సీఈవో ఫుడీ, సీటీఓ ఆదర్శ్, బోర్డ్ చైర్మన్ సూర్య తక్కువ వయసులోనే స్వయం కృషితో బిలియనీర్లుగా ఎదిగినవారిగా రికార్డు సృష్టించారు.