కైరో : ప్రపంచంలో అతి పెద్ద మ్యూజియం శనివారం నుంచి సాధారణ ప్రజల సందర్శన కోసం అందుబాటులోకి వచ్చింది. ఈజిప్ట్‌లోని గీజా పిరమిడ్ల సమీపంలో ఉన్న ఈ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం సందర్శనకు ఏటా 80 లక్షల మంది వస్తారని అంచనా.
దీనిని దాదాపు రూ.8,878 కోట్ల ఖర్చుతో, 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 1,00,000కుపైగా ప్రాచీన కళాఖండాలు ఉన్నాయి. 7,000 సంవత్సరాల ఈజిప్ట్ చరిత్రను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియంలో యువరాజు టుటాంఖమున్ సమాధి ప్రత్యేక ఆకర్షణ.