భారతీయులపై విద్వేషం.. అమెరికాలో పెరుగుతున్న ధోరణి
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో భారత్‌కు చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి. భారతీయులను గెంటేయండి, ఇండియన్ గో బ్యాక్ నినాదాలతో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
- ట్రంప్ రెండో పర్యాయంలో 91 శాతం పెరిగిన కేసులు
- యూరప్, ఆస్ట్రేలియాలోనూ ఇదే తీరు
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో భారత్‌కు (Indians) చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి. భారతీయులను గెంటేయండి, ఇండియన్ గో బ్యాక్ నినాదాలతో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దక్షిణ ఆసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్లైన్ ద్వేషం, హింస పరిమితంగా ఉండేది. 2024, అక్టోబర్ నాటికి 46 వేలు ట్రోలింగ్, 884 బెదిరింపు కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితి అధ్వానంగా మారింది. 2025, అక్టోబర్ నాటికి 91 శాతం పెరిగి కేసుల సంఖ్య 88 వేలకు చేరుకుంది.
ఆజ్యం పోసిన ట్రంప్ నిర్ణయాలు
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్-1బీ వీసా ఫీజు అనూహ్యంగా పెంచడం, 104 మంది భారతీయులను వెళ్లగొట్టడం వంటివి భారతీయులపై ద్వేషానికి ఆజ్యం పోసినట్టయ్యింది. తత్ఫలితంగా కాల్పులు, టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియాలలో దేవాలయాలపై దాడులు పెరిగాయి. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అంచనా ప్రకారం ఇటీవలి నెలల్లో జాత్యహంకార పోస్టులు కూడా వేగంగా పెరిగాయి. ట్రంప్ పాలసీల కారణంగా భారతీయులపై జాత్యహంకార, ఆన్లైన్ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. కేవలం వ్యాఖ్యలకు పరిమితం కాకుండా ఏకంగా దక్షిణాసియా సమాజాన్నే లక్ష్యంగా చేసుకుని ద్వేష ప్రచారం పెరిగింది.
‘దేశం నుంచి భారతీయులను వెళ్లగొట్టండి’ నినాదాలు ఎక్కువయ్యాయి. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలలో వలసదారులపై ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఆగ్రహం జాత్యహంకార ధోరణికి మొదటి ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న మితవాద రాజకీయాల్లో ఈ భావన ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. హెచ్-1బీ వీసా విధానం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. తమకు ఆ ఉద్యోగాలకు తగిన అర్హత లేకపోయినప్పటికీ, అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులు ఎత్తుకుని పోతున్నారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

