జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చిన కోర్టు
జార్జి ఫ్లాయిడ్ |

వాషింగ్టన్ : అగ్రరాజ్యంలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నియాపాలిస్ మంగళవారం తీర్పు వెలువరించింది. పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. త్వరలోనే నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. అలాగే డెరెక్ బెయిల్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు తీర్పుపై ఫ్లాయింట్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అనంతరం.. ఫ్లాయిడ్ మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. వీధుల్లో ఫ్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలం’ అని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. ఇదిలా ఉండగా.. 40 ఏళ్ల పాటు డెరెక్‌కు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపాలిస్ నగరంలో నకిలీ నోట్లు సరఫరా చేశారన్న ఆరోపణలతో 2020, మే 25న నిరసనలో పాల్గొన్న 46 జార్జి ఫ్లాయిడ్‌ను అరెస్టు చేసే నెపంతో ఫ్లాయిడ్ మెడమీద కాలుపెట్టి ఆయన మరణానికి పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ కారణమయ్యారు. ‘దయచేసి వదిలిపెట్టండి, నాకు ఊపి ఆడటంలేదు’ అంటూ జార్జ్ ఫ్లాయిడ్ ప్రాధేయపడినా కనికరించకుండా తొమ్మిది నిమిషాల పాటు గొంతును మోకాలితో అదిమిపట్టారు. ఈ కారణంగానే జార్జ్ ఫ్లాయిడ్ మరణించారని అభియోగాలు నమోదయ్యయి.
ఈ నేపథ్యంలో చౌవిన్.. సెకండ్ డిగ్రీ అన్ ఇంటెన్షనల్ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మ్యాన్స్లాటర్కు కారకుడని, అతనికి ఈ మూడు కేసులకు సంబంధించిన శిక్ష విధించనున్నట్లు కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా కోర్టు తీర్పుకు ముందు యూఎస్ అంతటా నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. కాగా, జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంలో ముగ్గురు పోలీసు అధికారులు నేరం చేసేందుకు డెరెక్ చౌవిన్‌ను ప్రేరేపించారంటూ కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది చివరలో కేసు విచారణకు రానుంది.

ఇది కీలక ముందడుగు : జో బైడెన్
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శ్వేతసౌదం నుంచి మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి ఇది కీలక ముందడుగుగా అభివర్ణించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాకూడదని, నేటి తీర్పు ఆ సందేశాన్ని పంపుతుందన్నారు. ‘ఇది సరిపోదు.. ఇంతటితో ఆగదు’ అని పేర్కొన్నారు. నిజమైన మార్పును, సంస్కరణలు తెచ్చేందుకు, ఇలాంటి విషాదకరణ సంఘటను తగ్గించేందుకు మరింత కృషి చేయాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఫ్లాయిడ్ కుటుంబసభ్యులకు శ్వేతసౌధానికి పిలిచి మాట్లాడారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా కమలా హారిస్ అభివర్ణించారు. తీర్పుపై మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం హర్షం వ్యక్తం చేశారు. జ్యూరీ సరైన పని చేసిందని, కానీ.. నిజమైన న్యాయానికి ఇంకా చాలా చర్యలు అవసరమన్నారు. అలాగే ఫ్లాయిడ్ కుటుంబ తరఫున న్యాయవాది బెన్ క్రంప్ సైతం తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చరిత్రలో ఒక మలుపు అని, చట్ట అమలు.. జవాబుదారీతనంపై స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది’ అని క్రంప్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ రామన్న!
భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
మే 4 వరకు కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం : అమెరికా
13 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా.. ఎక్కడంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

