upadi hami scheme | బచ్చన్నపేట, అక్టోబర్ 23 : బచ్చన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం నిర్వహించారు. 2024 ఆగస్ట్ 2025 వరకు రూ.5 కోట్లతో జరిగిన వివిధ పనులపై బృందాలు తనిఖీలు నిర్వహించారు. డీఆర్డీవో చంద్రశేఖర్ సామాజిక తనిఖీ వేదికలో పలు అంశాలపై మాట్లాడారు. సభ్యులు తనిఖీ నివేదికలను అధికారులకు చదివి వినిపించారు. పంచాయతీ కార్యదర్శులు, టీఏలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్నారు.
పలు గ్రామాల్లో అన్ని రిజిష్టర్లను మెయింటైన్ చేయడం లేదని తెలిపారు. అనంతరం డీఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తనిఖీల్లో పనులు జరిగిన చోట ఫీల్డ్ అసిస్టెంట్లు మొబైల్ ఆన్లైన్ చేయడంపై కొందరు 85 శాతం వరకు పనిచేస్తే.. మరికొన్ని గ్రామాల్లో కొందరు 10 శాతం పనులను మాత్రమే ఆన్లైన్ చేశారు. నిర్లక్ష్యం చేసిన కార్యదర్శులకు, సీసీలు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు.
రికార్డుల పరంగా రూ.2,78,651 పెనాల్టీ రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ అంబికా సోనీ, ఎంపీడీవో మమతా బాయ్, ఎంపీవో మల్లికార్జున్, డీవీసీ సంధ్యా ప్రణయ్, క్యూసి శాఖ రాజవర్ధన్, ఎస్ఆర్పి నరేందర్, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో కృష్ణ , కార్యదర్శిలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు