Sara ali Khan | బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తాజాగా దర్శనం చేసుకున్న తర్వాత, ఆ దేవాలయంతో తనకున్న బలమైన, లోతైన అనుబంధం గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేను మొదటిసారిగా కెమెరా ముందు నిలబడింది ఈ పవిత్ర భూమిలోనే. నా మొదటి సినిమా జ్ఞాపకాలు, అపారమైన భక్తి ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రతిసారీ ఇక్కడికి రావడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది అని సారా తెలిపారు. సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను సందర్శిస్తూ, ఆ అనుభూతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. హిందూ దేవాలయాలను సందర్శించడం, సంప్రదాయాలను గౌరవించడం పట్ల ఆమె చూపించే ఆసక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది స్కై ఫోర్స్, మెట్రో ఇన్ డీనో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సారా ప్రస్తుతం పతి పత్ని ఔర్ దో వో(Pati Patni Aur Woh Do) అనే చిత్రంలో నటిస్తుంది.
Sara Ali
Sara Ali Khan
Sara Ali Khan Kadarnath
Sara Ali Khan Kedar