గువహతి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం గ్రూప్-హెచ్లో భాగంగా భారత్.. 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచి నాకౌట్ దశకు చేరువైంది.
ఈ మ్యాచ్ కోసం భారత్ రెగ్యులర్ ప్లేయర్లను కాకుండా కొత్త ఆటగాళ్లను బరిలోకి దించినా పెద్దగా కష్టపడకుండానే లంకను ఓడించింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌పై జపాన్, ఈజిప్ట్‌పై ఫ్రాన్స్, ఇంగ్లండ్‌పై చైనా, డెన్మార్క్‌పై బ్రెజిల్, భూటాన్‌పై కొరియా విజయం సాధించాయి.