హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 3-1(12-15, 15-13, 15-6, 19-17)తో కొచ్చి బ్లూస్పైకర్స్పై ఘన విజయం సాధించింది.
తొలి సెట్‌ను కొచ్చికి చేజార్చుకున్న కోల్‌కతా.. ఆ తర్వాత పుంజుకుని వరుస సెట్లను కైవసం చేసుకుంది. కొచ్చి తప్పిదాలను తమకు అనుకూలంగా మలుచుకున్న కోల్‌కతా రెండో సెట్ గెలిచి స్కోరు సమం చేసింది. మూడో సెట్‌లోనైతే పూర్తి ఆధిపత్యం థండర్బోల్ట్స్ది అయ్యింది. పంకజ్‌శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.