చెన్నై: అరంగేట్రం బీఎఫ్ఐ కప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 55-60కిలోల విభాగం ఫైనల్లో హుసాముద్దీన్(సర్వీసెస్) 5-0 తేడాతో సాగర్ జాఖర్(సాయ్)పై అద్భుత విజయం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య విజేత అయిన హుసాముద్దీన్ ఆది నుంచే ప్రత్యర్థిపై తనదైన ఆధిపత్యం కొనసాగించాడు. ఓవైపు పవర్ఫుల్ పంచ్‌లు సంధిస్తూనే మరోవైపు ప్రత్యర్థి ఎదురుదాడిని సమర్థంగా తిప్పికొట్టాడు.
ఈ క్రమంలో రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ బౌట్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు సర్వీసెస్ బాక్సర్లు విశ్వనాథ్(47-50కి) 5-0తో ఆశిష్(హర్యానా)పై, ఆశిష్(50-55కి) 3-2తో నవరాజ్(ఏఐపీ)పై, వంశజ్(60-65కి)..3-2తో ప్రీత్మాలిక్పై గెలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. 65-70కిలోల తుది పోరులో సుమిత్‌కుమార్(సాయ్) 5-0తో రజత్(సర్వీసెస్)పై గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు.