హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను రూ.714.73 కోట్లతో చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కానున్నట్టు వివరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సోమవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 3 ఎకరాల స్థలంలో డబుల్ స్టోరీ స్కైకాన్కోర్క్, 3 వేల మంది ప్రయాణికులకు వసతి కల్పించే సామర్థ్యంతో వెయిటింగ్ హాల్ కోసం స్థలం, రెస్టారెంట్లు, రిటైల్ కేంద్రాలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కిషన్‌రెడ్డి వెంట దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్, తదితరులు ఉన్నారు.