హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సదానందంగౌడ్, జుట్టు గజేందర్ ఎన్నికయ్యారు. 2026-27 సంవత్సరానికిగాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా, వీరితోపాటు ఆర్థిక కార్యదర్శిగా సాబేర్ అలీ ఎన్నికయ్యారు.
మరో 8మంది అసోసియేట్ అధ్యక్షులు, 16మంది ఉపాధ్యక్షులు, 8మంది అదనపు ప్రధాన కార్యదర్శులు, 16మంది కార్యదర్శులు, 8మంది ఆర్థిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.