హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యిందని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఆదివారం రాష్ట్రంలో పర్యటించాలి.
ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో అమూల్ ప్లాంట్ ప్రారంభోత్సవం, తర్వాత కరీంనగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ చివరికి రద్దయ్యింది. అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడం ఇది రెండో సారి.