సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వాన కురిసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెమటలు పట్టించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. రాత్రి 10గంటల వరకు శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ ప్రాంతంలో 5.43సెం.మీలు, మామిడిపల్లిలో 3.45సెం.మీలు, మైలార్‌దేవ్‌పల్లిలో 1.33సెం.మీలు, కీసరలో 1.0సెం.మీలు, రాజేంద్రనగర్ శివరాంపల్లిలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.8డిగ్రీలు, గాలిలో తేమ 65శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.