నకిరేకల్ : సీఎం కేసీఅర్ జన్మదిన వేడుకలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిహేళన చేసి మాట్లాడడం దుర్మార్గం అనిమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..వాటిని సీఎం కేసీఆర్ ఖండించారు. అలాంటి సంస్కారం కేసీఆర్‌ది. కేసీఆర్ జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలుగా జరపాలని చెప్పిన నీచ సంస్కారం రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు.
అసోం సీఎం హేమంత్ శర్మకంటే సంస్కార హీనుడు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహులకు, ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఘాటుగా ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరాడని, సొంత పార్టీ నేతలే చెబుతున్నరు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు..ఇప్పటికి టీడీపీ కోవర్ట్ అన్నారు.