ఇచ్చోడ, మార్చి 6: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 నుంచి 2014 వరకు అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్నీ పోషించుకున్నది. భర్త వెంకటేశ్వర్లు సహకారంతో ఎంఏ పూర్తి చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) లో గ్రేడ్ – 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం 2013లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఖమ్మం జిల్లా కూసుమాం చి మండలం నాయకన గూడ గ్రామానికి చెందిన పూస ఉమారాణి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఇచ్చోడ మండల గ్రేడ్ -2 సూపర్వైజర్గా బాధ్యతలు స్వీకరించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలు, సీమంతా లు, పోషణ మాసం, రక్త హీనత వంటి కార్యక్రమాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించి చైతన్యం కల్పించే విధంగా కృషి చేస్తున్నారు. ఈమె కృషికి ప్రభుత్వం 2018 లో గ్రేడ్ -1 సూపర్వైజర్గా ప్రమోట్ చేసిం ది. ములుగు జిల్లా వెంకటపురం (ఐసీడీఎస్) కు బదిలీపై వెళ్లారు. కరోనా వంటి కష్టకాలంలో అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉండడంతో నేరుగా లభ్ధిదారుల ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకుల్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో కలిసి అందించారు. కొవిడ్ గురించి లబ్ధిదారులకు క్లుప్తంగా అవగాహన కల్పించి చైత న్యవంతుల్ని చేస్తున్న తీరును కొనియాడుతూ ట్విట్టర్లో ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ స్వయంగా ప్రశంసించారు. అనంతరం ఏడాది తరువాత తిరిగి బోథ్ ఐసీడీఎస్ పరిధిలోని ఇచ్చోడ సెక్టార్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ తన సేవలతో ఎంతో గుర్తిం పు సాధించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈమె సేవలను గుర్తించి ఉత్తమ గ్రేడ్ 1 సూపర్వైజర్గా అవార్డు అందజేసింది.

బాసర, మార్చి 6 : పుట్టింది మారుమూల గ్రామం.. పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఏడేండ్లుగా స్టేషన్‌కు వచ్చే వివిధ కేసులకు సంబంధించి ఆన్లైన్ ఫైలింగ్‌లో ప్రతిభ కనబర్చింది. కేంద్ర హోంశాఖ ద్వారా జాతీయ అవార్డు సాధించింది కానిస్టేబుల్ అన్విత. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన దొడ్లే ముత్యం-అనితకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ముత్యం ప్రైవేట్‌గా షాపు నడుపుకుంటూ పిల్లలను చదివించారు. అందులో పెద్ద కూతురు అన్విత చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివేది. ఏనాడూ ఏకాగ్రత కోల్పోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోలీస్‌శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకుంది. అందుకు తగ్గట్లే ఎంతో కష్టపడింది. 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. దీంతో బాసర పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ ఇవ్వగా.. అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నది. 2016లో కుంటాల మండలం కల్లూర్‌కు చెందిన శోభన్‌తో ఆమెకు వివాహమైంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్విత నేర వ్యవస్థకు సంబంధించిన పనులు చూసుకునేది. ఎప్పటికప్పుడు నేర సమాచారాన్ని ఆన్లైన్లో పొందు పరిచేది. కంప్యూటర్లో ఐసీజేఎస్ (ఇంటర్ ఆపరేబల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం), సీసీటీఎన్ఎస్(క్రైంఅండ్క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్) ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తున్నది. కాగా.. అన్విత ఇక్కడి పోలీస్‌స్టేషన్‌కి సంబంధించి క్రైం ఫైల్స్‌తో పాటు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుండడంతో కేంద్రానికి డాటా వెళ్తుండేది. ఇతర రాష్ర్టాల్లో కూడా సీసీటీఎన్ఎస్ ద్వారా కేసులను కేంద్ర మంత్రిత్వశాఖ దీని ద్వారా చేరవేస్తున్నది. కాగా.. ఈమెకు 2021, డిసెంబర్లో కేంద్ర హోంశాఖ నుంచి జాతీయ అవార్డు లభించింది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆమెకు తెలిపారు. తెలంగాణలో ముగ్గురికి మాత్రమే ఈ జాతీయ స్థాయి అవార్డు దక్కగా.. అందులో అన్విత ఒకరు కావడం గమనార్హం. తనకు ఢిల్లీ నుంచి అవార్డు వచ్చిందని ఫోన్ రావడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అభినందనలు తెలుపడం చాలా ఆనందంగా ఉందని అన్విత పేర్కొన్నారు. అవార్డు వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పింది.
దండేపల్లి, మార్చి 6 : సాంకేతికతను ఉపయోగించుకొని సేంద్రియ సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తూ పలువురితో శభాష్ అనిపించుకుంటున్నది. నందుర్క సుగుణ తన భర్త నారాయణతో కలిసి ఎకరంలో రెడ్‌రైస్(నవారా), 5 గుంటల్లో బ్లాక్‌రైస్(కాలాబట్), 20 గుంటల్లో సన్‌ఫ్లవర్, 20 గుంటల్లో పెసర, 10 గుంటల్లో దేశీ నువ్వులు, 10 గుంటల్లో స్వీట్‌కార్న్, ఎకరన్నరలో మక్క, 10 గుంటల్లో సామలు, 10 గుంటల్లో అరికెలు, అర ఎకరంలో చిక్కుడు, బెండ, బీర, కాకర, అల్చింత, కొత్తిమీర తదితర కూరగాయలు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నది. ప్రజలకు రసాయనాలు వాడని ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో పూర్తి స్థాయిలో సేంద్రీయ పద్ధతి ద్వారా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నది. అలాగే అరికెలు, సామలు (మిల్లెట్స్)లాంటి చిరు ధాన్యాలు సాగు చేస్తున్నది. వ్యవసాయంలో ఎప్పటి కప్పుడు నూతన పద్ధతులను అవలంబించి వినూత్న ప్రయోగాలు చేస్తున్న ది. కలెక్టర్ భారతీ హోళికేరి స్వయంగా సుగుణ సాగు చేస్తున్న పంటలను సందర్శించి అభినందించారు. జనవరి 26న కలెక్టర్ భారతీ హోళికేరి చేతుల మీదుగా ఉత్తమ మహిళా రైతుగా అవార్డు అందుకున్నది.

ఉన్నతాధికారుల ప్రశంసలు..
నా భర్త నారాయణతో కలిసి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న. ఇద్దరు కుమారుల తోడ్పాటు, వ్యసాయాధికారుల ప్రోత్సాహంతో కొత్త పంటలు సాగు చేస్తున్న. జిల్లాలో ఎక్కడా లేని సన్‌ఫ్లవర్ వేసిన. కలెక్టర్, ఉన్నతాధికారుల ప్రశంసలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.
– నందుర్క సుగుణ, మహిళా రైతు, నాగసముద్రం
మంచిర్యాల, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు మంచిర్యాల సఖీ కేంద్రం అడ్మిన్(సీఏ) శ్రీలత హాజరయ్యారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మార్చి 1, 2 తేదీల్లో వన్ స్టాప్ సెంటర్ల నిర్వాహకులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్త్రీ మనోరక్ష ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ర్టాల నుంచి 2,333 మంది సఖీ సెంటర్ అడ్మిన్లు హాజరయ్యారు. ఈ సెమినార్లో మహిళలను ఆదుకోవడంలో వన్ స్టాప్ సెంటర్లు పోషించే పాత్రపై శ్రీలత వెల్లడించారు. దీంతో మహిళల మానసిక, సామాజిక శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దీని ద్వారా సఖీ కేంద్రానికి వచ్చే మహిళల భద్రత, ఇతర వ్యవహారాలపై అవగాహన కలిగిందని, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన సీఏల ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. సఖీ సెంటర్ మహిళలకు సహాయం చేయడంలో కౌన్సెలర్ల నుంచి సెక్యూరిటీ గార్డు, సూపర్ వైజర్ వరకు సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని కేంద్రమంత్రి సూచించారని తెలిపారు. ఈ సెమినార్లో మహిళలకు అందిన న్యాయం, ఇతర అంశాలపై ప్రాజెక్టులను ప్రదర్శించారని పేర్కొన్నారు. తరచూ సెమినార్లు నిర్వహిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయ పడ్డారు.

నిర్మల్ అర్బన్, మార్చి 6: అప్పటి వరకు ఆమె సాధారణ మహిళే.. తన భర్త కూచాడి శ్రీహరి రావు లాయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తానూ ఎల్ఎల్బీ చదువుతానని మనసులోని మాటను భర్తకు వివరించింది. ఇందుకు భర్త సరేనని అనడంతో ఆమె న్యాయవాద ప్రస్థానం ప్రారంభమైంది. త్వరలో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఆమెకు దక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జువ్వాడి సూర్యారావు, భారతి దంపతుల కుమార్తె జువ్వాడి శ్రీదేవి. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామానికి చెందిన న్యాయవాది శ్రీహరి రావును వివాహం చేసుకున్నది. ప్రసుత్తం వీరు నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు. భర్త సహకారంతో 1997లో న్యాయవాదిగా కోర్టులో అడుగు పెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు న్యాయ విద్యలో ఆరితేరి నిర్మల్ కోర్టులో ఏపీపీవోగా, జీపీ గాను ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు పీపీ, జీపీగా తాను ఎంచుకున్న రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వియోగం చేసుకున్నారు. 1997లో న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత 2004-08 దాకా నిర్మల్ అదనపు సెషన్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, 2014-2017 వరకు రాష్ట్ర హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడరుగా, 2018 జనవరి నుంచి హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్నారు.

ప్రయత్నమే తొలిమెట్టు
మనం ఏదైనా సాధించాలంటే ప్రయత్నమే తొలిమెట్టు కావాలి. తెలంగాణకు చెందిన తొలి మహిళగా నాకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. యోధులు, ధీరవనితలను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యం కోసం కృషి చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది.
-కూచాడి శ్రీదేవి, నిర్మల్
కోటపల్లి, మార్చి 6 : కుమ్మరి దుర్గవ్వ.. ఇన్నాళ్లు ఈ పేరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆమె పేరు చెప్తే తెలంగాణ-ఆంధ్రా ప్రజలు భీమ్లానాయక్ దుర్గవ్వనా అని అంటారు. చేనులో అలసట తెలియకుండా ఉండేందుకు పాడిన పాట ఆమెను సినిమా రంగానికి పరిచయం చేసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దుర్గవ్వ భీమ్లా నాయక్‌లో పాడిన పాటతో ఒక్కసారిగా తెలుగు రాష్ర్టాల్లో మెరిసింది. ఇటీవల సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో ఒక్కసారిగా స్టేజ్‌పై దుర్గవ్వ కనిపించడంతో అందరి దృష్టి ఆమె వైపే మళ్లింది. నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గవ్వ టుంగురమే పాటతో జానపద గాయనిగా పరిచయం కాగా, ఈమె గొంతు విన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భీమ్లానాయక్ సినిమాలో పాడేందుకు అవకాశం కల్పించారు. గ్రామీణ గాయనిగా పేరు సంపాదించున్న దుర్గమ్మ బీమ్లానాయక్లో ‘చెపుతున్న నీ మంచి చెడ్డ అంతోటి పంతాలు పోకు బిడ్డ.. చిగురాకు చిట్టడవి గడ్డ అట్టుడికి పోరాదు బిడ్డ’ అనే పాట పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హైదరాబాద్‌లో జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్, సినిమా హీరోలు పవన్‌కల్యాణ్, రానా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తోపాటు ఎంతో మంది ప్రముఖులను కలవడంతో పాటు స్టేజ్ పైన భీమ్లానాయక్ సినిమాలో పాడిన పాట మరోసారి పాడి శభాష్ అనిపించుకున్నది.