UAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ!
UAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ! | టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఈ నెల 30 నుంచి టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ

అబుదాబి : టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను ఈ నెల 30 నుంచి దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) పేర్కొన్నాయి. అయితే, కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే అవకాశమని పేర్కొన్నాయి.
ఈ నిర్ణయం గతంలో నిషేధించిన దేశాలు సహా.. అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని, టూరిస్ట్ వీసా కలిగిన ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరని, వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులకు (ఆంక్షలు విధించిన దేశాల నుంచి వచ్చే వారికి) ఇంతకుముందు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతాయి’ అని తెలిపాయి. ప్రయాణానికి ముందే టూరిస్ట్ వీసాదారులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను ఐసీఏ వెబ్సైట్, అల్‌హోస్న్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించాయి.
కొవిడ్ రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్, నైజీరియాతో పలు దేశాల నుంచి యూఏఈ రాకపోకలను నిలిపివేయగా.. ప్రస్తుతం క్రమంగా నిబంధనలను సడలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో స్థానిక నివాసితులు దేశంలోకి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన టీకాల జాబితాలో ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఫైజర్, సీనోఫార్మ్, సీనోవాక్ ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

