అచ్చంపేట రూరల్ : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెన్షన్ ( Suspension ) చేశారు. మండలంలోని అంకిరోనిపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బి కల్పన ( Kalpana ), అక్కరం పంచాయతీలో ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రత్లావత్ మక్తలాల్( Ratlavat Maktalal ) ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. జూలై నెల డీఎస్ఆర్ యాప్లో నకిలీ ముఖ గుర్తింపు హాజరు ఇచ్చారని గుర్తించడంతో వారిద్దరిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించినందుకు చర్యలు తీసుకున్నారు .