కరోనా బారినపడి మరో ఇద్దరు సాధువుల మృతి
కరోనా బారినపడి మరో ఇద్దరు సాధువుల మృతి | నిరంజనీ అఖాడా మనీష్ భారతికి చెందిన శ్రీ మహంత్ (49) కన్నుమూశారు.

డెహ్రాడూన్ : నిరంజనీ అఖాడా మనీష్ భారతికి చెందిన శ్రీ మహంత్ (49) కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆయన రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఈ నెల 15న కరోనా పాజిటివ్‌గా పరీక్షించగా.. చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. అలాగే అదే అఖాడాకు చెందిన లఖన్ గిరి సైతం వైరస్ బారినపడి కన్నుమూశారు. దీంతో ఇప్పటి వరకు ఆరుగురు సాధువులు కుంభమేళాకు హాజరైన అనంతరం కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.
నిరంజని అఖాడా ఆఫీస్ బేరర్స్ వివరాల ప్రకారం.. లఖన్ గిరి (95) శ్రావణ్ నాథ్ మఠం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అఖాడాకు చెందిన ముగ్గురు సాధువులు మృతి చెందగా.. మిగతా వారిని భయాందోళనలకు గురి చేసిందని నిరంజనీ అఖాడా ఒక ప్రకటనలో పేర్కొంది. హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే ఝా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ అఖాడాల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 250 మంది సాధువులు కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

