హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయానికి గ్రీవెన్స్‌సెల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు ఆ సంఘం రాష్ట్ర నాయకులు చావా రవి, వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం ఆర్టీఈలో సవరణలు తీసుకురావాలని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరామని తెలిపారు.