హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టెట్-2026కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్‌కు అధికారులు అవకాశం కల్పించారు. ఈనెల 25నుంచి డిసెంబర్ 1వరకు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను సరిచేసుకోవడానికి ‘ఎడిట్’ ఆప్షన్ ద్వారా అవకాశం కల్పించారు.
ఈ మేరకు ఆన్లైన్ దరఖాస్తుల ఫీజు చెల్లింపును ఈనెల 29వరకు గడువు విధించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం తెలిపారు. దరఖాస్తు, ఎడిట్ ఆప్షన్ వంటి వివరాల కోసం https://schooledu. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి ఆయన సూచించారు.