ఆర్యవైశ్యుల మద్దతు…
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నట్లు హుజూరాబాద్ లోని ఆర్యవైశ్య సంఘం ప్రకటించింది. ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన ఆర్యవైశ్య కుల పెద్దలు ఆయనను సన్మానించి మద్దతు ప్రకటించారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ...
హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వారికి రేషన్‌కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రజకసంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం హుజురాబాద్ లో రజక సంఘం నాయకులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ముఖ్య కార్యకర్తల సమావేశం…
హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అథితిగా విచ్చేశారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్, స్థానిక సర్పంచ్,తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.