హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో ఆసరా పెన్షన్ అందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 5 లక్షల మంది దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్‌ను అందజేస్తున్నది. ఇందుకు ఏటా రూ.1,800.96 కోట్లు వెచ్చిస్తున్నది. ఇంత మొత్తంలో దివ్యాంగులకు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సామాజిక, ఆర్థిక నివేదిక స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఇస్తూ స్వశక్తితో వారు ఎదిగేలా ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్-2021 నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో మొత్తంగా 2 శాతం మంది దివ్యాంగులు ఉన్నారు.
దివ్యాంగులకు వివిధ రాష్ర్టాలు అందిస్తున్న పింఛన్లు
తెలంగాణ :3,016
ఆంధ్రప్రదేశ్ :3,000
హర్యానా :2,500
గోవా :1,700
రాజస్థాన్ :1,500
కేరళ :1,300
పంజాబ్ :1,200
కర్ణాటక :1,000
గుజరాత్ :1,000
తమిళనాడు :1,000
ఉత్తరప్రదేశ్ :1,000
జార్ఖండ్ :700
పశ్చిమబెంగాల్ :700
బీహార్ :400
మధ్యప్రదేశ్ :300
మహారాష్ట్ర :300
ఛత్తీస్‌గఢ్ :200
ఒడిశా :200