గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అస్సాంకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించిన బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదలతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గౌహతిలో ఉన్నారు.