Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
Chevella Court | మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ అన్నారు.
మొయినాబాద్ : మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు ( Chevella Court ) బదిలీ ( Transfer) చేస్తూ జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ( President Madhusudan Reddy ) , ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ అన్నారు. కొంతమంది న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
గతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తో పాటు రాజేంద్రనగర్ కోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనికి వచ్చేవని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్స్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తో పాటు చేవెళ్ల కోర్టు వస్తుందని, కానీ ప్రస్తుతం రాజేంద్రనగర్ కోర్టు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనికి వస్తుందని పేర్కొన్నారు.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిమినల్ కేసులకు సంబంధించిన కక్షిదారులు రాజేంద్రనగర్ కోర్టుకు వెళ్లడానికి మూడు బస్సులు మార్చడంతో పాటు కక్షీ దారులకు దూర భారం పెరగడం, సమయం కూడా ఎక్కువ పడుతుందని చెప్పారు. చేవెళ్ల కోర్టుకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిమినల్ కేసు లను బదిలీ చేయడం వలన కక్షీ దారులు నేరుగా ఒకే బస్సు ఎక్కి వెళ్లి రావడానికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు ఒకే కోర్టు పరిధిలోనికి రావడంతో పాటు కక్షిదారు డు ఒకే న్యాయవాదిని పెట్టుకోవడం వలన వారికి ఖర్చు భారం కూడా తగ్గుతుందని అన్నారు. క్రిమినల్ కేసులు ఒక కోర్టులో, సివిల్ కేసులు మరో కోర్టులో ఉండటం వలన కక్షిదారులు వేర్వేరుగా ఇద్దరు న్యాయవాదులను పెట్టుకోవడం వలన వారికి ఆర్థిక భారం కూడా బాగా పెరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. సమావేశంలో న్యాయవాదులు ఎం సురేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సంగప్ప, సతీష్ కుమార్, సిహెచ్ మహేష్ గౌడ్, సందీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీధర్, మహేష్, జయరత్నం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

