గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
గుర్రంపోడు మండలంలోని రైతు వేదికలో శుక్రవారం ఏవో కంచర్ల మాధవరెడ్డి రైతులకు పత్తి సాగులో హెచ్‌పీఎస్ (హై డెనిసిటి ప్లాంటింగ్ సిస్టమ్) అలాగే ఐసిఎం (ఇంటిగ్రెడెట్ క్రాఫ్ మెనేజీమెంట్) పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గుర్రంపోడు, అక్టోబర్ 09 : గుర్రంపోడు మండలంలోని రైతు వేదికలో శుక్రవారం ఏవో కంచర్ల మాధవరెడ్డి రైతులకు పత్తి సాగులో హెచ్‌పీఎస్ (హై డెనిసిటి ప్లాంటింగ్ సిస్టమ్) అలాగే ఐసిఎం (ఇంటిగ్రెడెట్ క్రాఫ్ మెనేజీమెంట్) పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించడం, సరైన ఎరువుల యాజమాన్యం, నీటి వినియోగం, చీడపీడల నివారణ మరియు పంట దిగుబడిని పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం అస్థిరంగా ఉండడం అలాగే నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ వ్యవధి పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, వాతావరణ ఆధారిత సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
నేలలో తేమను కాపాడేందుకు పంట అవశేషాలను ఉపయోగించడం, మల్చింగ్ చేయడం, అవసరానికి అనుగుణంగా మాత్రమే నీటి పారుదల చేయడం, వర్షపు నీటిని సంరక్షించడం అలాగే వాతావరణ హెచ్చరికలను అనుసరించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించేందుకు సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహా సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతులు నూతన సాగు పద్ధతులను అవలంబించి, నాణ్యమైన దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రామాంజనేయులు, గౌతమి, మనోజ్, జ్యోత్స్న, ధరణి, నేతాజీ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Gurrampodu
- HPS
- ICM
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

