MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
MLA Palla Rajeshwar Reddy | బీజేపీకి తొత్తుగా ఉన్న జ్ఞానేశ్వర్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : బీజేపీ ( BJP ) కి తొత్తుగా ఉన్న జ్ఞానేశ్వర్ కుమార్ ( Gyaneshwar Kumar ) ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ( MLA Palla Rajeshwar Reddy ) డిమాండ్ చేశారు. తెలంగాణ భవనలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు తొలగించడం వల్ల లాభ పడ్డది బీజేపీ మాత్రమేనని అన్నారు.
మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మకై బీజేపీని పలు రాష్ట్రాల్లో గెలిపించారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలను అడ్డుపెట్టుకుని బీజేపీ గెలిచిందని విమర్శించారు.
బెంగాల్లో ఎన్నికలు జరిగిన వెంటనే నాలుగు వేల ఈవీఏంలను కాల్చివేయడం తో ఎన్నికల కమిషన్ కుట్ర బయట పడ్డదని వెల్లడించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఈవీఎంల పై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. పండుగల దృష్ట్యా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం బూర్గుల రామకృష్ణా రావు భవన్ దగ్గర శనివారం బీఆర్ఎస్ తల పెట్టిన ధర్నాను వాయిదా వేస్తున్నామని మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

